512 జీవో రద్దు చేయాలంటూ న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష

by vizagwebnews.com

#vizagwebnews
512 జీవో రద్దు చేయాలంటూ న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్_27/2023 చట్టాన్ని వ్యతిరేకిస్తూ చోడవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు…….

ఆపై జీవో నెంబర్ 512 అమలు చేస్తే రైతులు పేదలు తీవ్రంగా నష్టపోతారని,వెంటనే ప్రభుత్వం జీవోని రద్దు చేయాలని ఆందోళనలు దిగారు.

ప్రజా వ్యతిరేక చట్టం 27ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చోడవరం బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు…
బార్ అసోసియేషన్ కార్యదర్శి గొర్లె కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ యాక్ట్ 27 కారణంగా బినామిల పెత్తనంతో యాజమాన్య హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
అసలు ఎవరికోసం ఈ చట్టాన్ని తెరపైకి తెస్తున్నారో అర్ధం కావడం లేదని ప్రజలు మాట్లాడుకొంటున్నారని , ఈ చట్టం వలన ప్రజలలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని , కబ్జాదారులకు వరంగా ఈ చట్టం మారనున్నట్లు పలువురు న్యాయవాదులు విచారం వ్యక్తం చేసారు…..బలం ఉన్నవాడిదే రాజ్యం గా మారే అవకాశం ఈ యాక్ట్ తీసుకువస్తుందని తెలిపారు

రాజకీయ పార్టీలకు తలోగ్గకుండా చట్టాలు, సంస్కరణలు చేసే ముందు అధికారులు ప్రజా శ్రేయస్సును దృష్టిలో వుంచుకోవాలన్నారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బ తీసే సంస్కరణలు, చట్టాలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
ఈ కార్యక్రమంలో చోడవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి గొర్లె క్రిష్ణ వేణి,
పోతల ప్రకాశరావు, మాజీ ఏ.పి.పి. లు అల్లు గిరిధర్, కందర్ప స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Comment