Decoration of Shree Durgamamba Amma in Gavarajaggayapalem with Rs 1.5 crore

by vizagwebnews.com

#vizagwebnews
Decoration of Shree Durgamamba Amma in Gavarajaggayapalem with Rs 1.5 crore
గవర జగ్గయ్యపాలెంలో
సుమారు కోటి 50లక్షల రూపాయల కరెన్సీతో అమ్మవారి కి అలంకరణ.

గవర జగ్గయ్యపాలెంలో  వెలసిన దుర్గమాంబ ఆలయంలో నవరాత్రి మహోత్సవాలుఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ  ఉత్సవంలో భాగంగా ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని సుమారు 50 లక్షల రూపాయల కరెన్సీతో అలంకరణ చేశారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే నవరాత్రి మహోత్సవాలు  ఘనంగా నిర్వహిస్తున్నామనితెలిపారు. ఈ ఆలయంలో ప్రతిరోజు అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకాలునిర్వహిస్తామని, అదేవిధంగా అమ్మవారిని విశిష్ట అలంకరణతో చేస్తామని,  అదేవిధంగా  ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు అన్న తమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మ కర్త కాండ్రేగుల జగ్గారావు సత్యవతి దంపతులు మరియు కాండ్రేగుల రాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Comment