వెలుగు వి ఓ ఏ ల సమస్య పరిష్కారం కోరుతూ ధర్నా..

by vizagwebnews.com

వెలుగు వి ఓ ఏ ల సమస్య పరిష్కారం కోరుతూ ధర్నా..
పాడేరు, ఆగష్టు 23:విఓఎల 3సం॥ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, సి.బి.ఓ.హెచ్.ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సైకర్యం కల్పించాలని, వివోల మెర్జ్ ఆపాలని,కోరారు.అలాగే
అన్ని రకాల బకాయిలు చెల్లించాలని కోరుతూ….డిమాండ్ చేశారు.
విఓఏల ఉపాధిని దెబ్బతీసే 3సంవత్సరాల కాలపరిమితి సర్క్యూలర్ రద్దు చేయాలని కోరుతున్నామని తెలిపారు.
గ్రామ సమాఖ్యల మెర్జ్ ఆపాలని కోరుతున్నామని అన్నారు.సంఘాలను విడగొట్టడం కలవపడం లాంటి పనులు సెర్చ్ అధికారులే చేశారు. వివోల మెర్జ్ చేయటంవలన వేలాది మంది వివోఏలకు ఉపాధిపోతుందని అన్నారు. ఇది మానవ వనరులకు విఘాతం కలిగించటమే. వివోఏల ఉపాధికి నష్టం లేకుండా వివోల మెర్జ్ను ఆపి, ఎక్కువ సంఘాలున్న వివోల నుండి తక్కువ సంఘాలున్న వివోలకి సర్దుబాటు చేయాలని, ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదని కోరుతున్నామని తెలిపారు . ఇప్పటి వరకు 15 సంఘాల లోపు ఉన్న వివోల వివోఎ లకు వేతనాలు చెల్లించలేదు. వివోల మెర్జ్ చేశారు. వివోఏ
గా ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.. వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి, వారి కుటుంబ సభ్యులకు వివోఏలుగా అవకాశం కల్పించాలని,లింగం, వయస్సు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలి. సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు .

(ఆర్.భాను)అధ్యక్షులు
ఎల్.బి.రాజ్కుమార్) ప్రధాన కార్యదర్శి పి.పోతురాజు) కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Comment