మాడుగుల తేదేపా అభ్యర్ది పై పునరాలోచన చేయాలి తేదేపా కార్యకర్తల ముసలం

by vizagwebnews.com

మాడుగుల తేదేపా అభ్యర్ది పై పునరాలోచన చేయాలి తేదేపా కార్యకర్తల ముసలం

గవిరెడ్డి రామానాయుడు కే టీడీపీ టికెట్ కేటాయించాలని టీడీపీ శ్రేణుల ర్యాలీ

వి.మాడుగుల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కే కేటాయించాలని కోరుతూ సుమారు వెయ్యి మంది టీడీపీ కార్యకర్తలు నిరసన,ర్యాలీ నిర్వహించారు…

ఈ సందర్భంగా పలువురు మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ నియోజక వర్గంలో టీడీపీ కార్యకర్తలకు ఇన్ని సంవత్సరాలపాటు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన రామానాయుడు ను కాదని, టీడీపీ ఓడిపోగానే అమెరికా వెళ్లిపోయిన వ్యక్తికి టికెట్ ప్రకటించడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు????
2009 లో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభంజనం లోకూడా టీడీపీ తరపున గెలిచి కాంగ్రెస్ ఎంత ప్రలోభ పెట్టినా టీడీపీ ని వీడకుండా ఉన్నందుకు అధిష్టానం ఇలా చేయడం టీడీపీ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇద్దామని అని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించారు….

అధిష్టానం మాడుగుల టికెట్ పై పునరాలోచన చేయకపోతే టీడీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు…

సీనియర్ కార్యకర్తలు మాట్లాడుతూ…..పైలా ప్రసాద్ లాంటి వెన్నుపోటుదారులకు టికెట్ కేటాయిస్తే కనీసం తమ వీధిలోని వారిని కూడా టీడీపీ కి ఓట్ వేయమని ఏ మొహం పెట్టుకొని అడుగగలం అని తమ ఆవేదన వ్యక్తం చేశారు…

పార్టీని నమ్ముకుని 10 సంవత్సరాలుగా కష్టపడిన రామానాయుడి కి టికెట్ కేటాయించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేసి వేరే పార్టీ కి వెళ్లిపోవడం తప్ప గత్యంతరం లేదని కన్నీటి పర్యంతమయ్యారు…
చంద్రబాబు నాయుడు మరొక్క సారి మాడుగుల నియోజకవర్గం సీట్ పై పునరాలోచన చేసి పార్టీకి,ప్రజలకు నిస్వార్థ సేవ చేసిన రామానాయుడు కి న్యాయం చేయాలని పలువురు నాయకులు, కార్యకర్తలు తెలిపారు…
#vizagwebnews

Related Articles

Leave a Comment