చోడవరం స్వయంభు శ్రీ వినాయకుని చవితి ప్రత్యేకపూజలు “200 ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ కార్య సిద్ధి విగ్నేశ్వరాలయ చరిత్ర”
దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద రెండు స్వయంభు విఘ్నేశ్వరాలయాలు ఉన్నట్లుగా పురాణాలు చెబుతున్నాయని ఇక్కడ ఆలయ చరిత్ర తెలుపుతుంది స్వయంభు అనగా స్వయంగా భూమి నుండి ఉద్భవించిన విగ్రహాలను మాత్రమే స్వయంభు గా పేర్కొంటారు….
“ప్రధమం కానిపాకంచ ద్వితీయం చోళవరం
స్వయంభు శ్రీ విఘ్నేశ్వరః గౌరీపుత్ర నమోస్తుతే”
అనే శ్లోకంలో ప్రస్తావించిన చోళవరం నేడు చోడవరం గా మార్పు చెందింది……
ఈ ఆలయానికి ఇంకో విశిష్టత కూడా ఉండడం గమనార్హం..
ఒకే ఊరిలో స్వయంభూ దేవాలయాలు చాలా అరుదు…అందునా స్వయంభు శ్రీ గంగాసమేత గౌరీశ్వర స్వామి దేవాలయం తో పాటు స్వయంభు శ్రీ కార్యసిద్ధి విఘ్నేశ్వరాలయం కలిగి ఉండడం చోడవరం ప్రత్యేకతగా చెప్పవచ్చు…..
స్వయంభు శివాలయం తో పాటు స్వయంభు విఘ్నేశ్వరాలయం ఉండడం మన రాష్ట్రం మొత్తం మీద చోడవరం గ్రామంలో మాత్రమే వుందని ఇక్కడి అర్చకులు తెలియజేస్తున్నారు….
సుమారు 200 సంవత్సరాలకు పూర్వం ఈ స్వయంభు విఘ్నేశ్వరుని విగ్రహం బయటపడిందని, అప్పటికే స్వయంభు శివాలయం ఇక్కడ ఉండడంతో ఆ శివాలయంలోకి ఈ విగ్రహాన్ని తరలిద్దామని నిర్ణయిచిన అప్పటి పెద్దలు, అర్చకులు విగ్రహం ఎంత తవ్వినా విఘ్నేశ్వరుడి తొండం అలా పెరుగుతూ దగ్గరలోని చెరువు వరకు విస్తరించడం వల్ల అది సాధ్యం కాలేదని అర్చకుని కలలో విఘ్నేశ్వరుడు కనిపించి తన విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించి దేవాలయం నిర్మించాలని చెప్పినట్లు అందువల్లే ఇక్కడే ఆలయం నిర్మించారని ఆలయ చరిత్ర తెలుపుతుంది…..
స్వామివారి తొండం ఆ చెరువు వరకు ఉండడంతో ఆ చెరువుని పూర్వం ఏనుగు బోధి అని పిలిచేవారట ప్రస్తుతం కాలక్రమేనా పాత చెరువుగా పేరుపొందింది….
ఇక్కడ విఘ్నేశ్వరుడు రోజురోజుకి పెరుగుతుండడం కూడా ఈ ఆలయ విశిష్టత గా తెలియజేయవచ్చు దీనికి ఆధారంగా గతంలో స్వామివారికి అలంకరిస్తున్న వెండి ఆభరణాలు ప్రస్తుతం చాలాక పోవడమే నిదర్శనమని , గతంలో స్వామివారికి ముప్పావు కేజీ వెండి కిరీటం సారిపోయేదని విగ్రహం పెరగడం తో ప్రస్తుతం రెండు కేజీల వెండి కిరీటం పెడుతున్నారని ఆలయ ప్రధానార్చకులు కొడమంచిలి చలపతి రావు శర్మ తెలియజేశారు….
కాణిపాక వరసిద్ధి వినాయకుడు వరాలను ప్రసాదిస్తే….. చోడవరం కార్యసిద్ధి వినాయకుడు వేడుకొంటే ఎలాంటి కార్యమైనా దిగ్విజయంగా పూర్తవుతుందని భక్తులు విశ్వసిస్తారు