కేబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరం.. విశేష స్పందన..
అల్లూరి పాడేరు, ఈరోజు మార్చి 16: స్థానిక అల్లూరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం కేబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ సౌజన్యంతో మెగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మెగా నేత్ర వైద్య శిబిరానికి కంటి సమస్యలు ఉన్న అనేక మంది వృద్ధులు గిరిజన యువతి యువకులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరాన్ని బట్టి వైద్యుల సూచనల మేరకు వైద్య చికిత్సతో పాటు అవసరము మేరకు ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు.నేత్ర సస్త్ర చికిత్సల నిమిత్తం విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ కు పలువురిని తరలించారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి గిరిజనుల వైద్యం కోసం ప్రత్యేక దృష్టి సాధిస్తున్న కేబీ ఫౌండేషన్ వారికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేవీ ఫౌండేషన్ కన్నబాబు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో వైద్య సేవలు వైద్య సలహాలు అందించడమే లక్ష్యంగా ఈ ఫౌండేషన్ను నిర్మించామని అన్నారు. 11 మండలాలలో ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని స్వచ్ఛందంగా 300 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని అన్నారు. ప్రజలందరి సహకారంతో తమ సేవను విస్తృతం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ వైద్యులు కేబీ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. #vizagwebnews