VMDA National Eminence Award Function A 7Days Festival Starts From Aug 13th 2022 #vizagwebnews

by prasad
1 views

VMDA National Eminence Award Function A 7Days Festival Starts From Aug 13th 2022 #vizagwebnews
విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి విశాఖ పట్నం గత 35 సంవత్సరాలుగా అనేకరకాల కళాకారులను ఆహ్వానించి కళలను ప్రోత్సహిస్తూ కళాకారులకు సహాయం చేస్తూ వస్తోంది . 36 వ సంవత్సరంలో అడుగు పెట్టి ఈ సంవత్సర వార్షికోత్సవాల్లో జాతీయ పురస్కారం బహుమతి లక్ష రూపాయల క్యాష్ అవార్డు, ప్రశంసా పత్రం ,నూతన వస్త్రాలు ,వాటితోపాటు ప్రతిష్టాత్మకమైన “నాట్య విద్యా భారతి” బిరుదు ప్రధానం ఈ నెల అంటే ఆగస్టు 13 వ తారీకు శనివారం నాడు సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు జరుగుతుంది .
ఈ సంవత్సరం ఎక్స్పర్ట్ కమిటీ మరియు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ట్రస్టు బోర్డు పద్మవిభూషణ్ డాక్టర్ సోనాల్ మాన్ సింగ్ ఒడిస్సి మరియు భరతనాట్య రీతులలో ఎంతో ప్రావీణ్యత పొంది గత ఆరు దశాబ్దాల పైన కృషి చేసి పట్టు సంపాదించి అనేక శిష్య ప్రశిష్యులను తయారుచేసి 94 దేశాలలో నృత్య ప్రదర్శనలిచ్చి భారతదేశానికి గర్వకారణమైన సోనాల్ మాన్ సింగ్ కి ఈ సంవత్సరం” నాట్య విద్యా భారతి బిరుదు” ప్రదానం జరుగుతుంది .
ఈ బిరుదు ప్రధానోత్సవం కి ముఖ్య అతిథిగా vice admiral దాస్గుప్తా , ఏ వి ఎస్ ఎం, వై ఎస్ ఎం, ఎస్ ఎం ఎస్ వారు విచ్చేసే వారి చేతుల మీదుగా ఈ బిరుదు ప్రదానం జరుగుతుంది.

సత్కార సభ అనంతరం అవార్డు గ్రహీత Dr. సోనాల్ మాన్సింగ్ వారి శిష్య బృందంతో” క్రిష్ణ కాలియా” నిత్య ప్రదర్శన చేసి అందరినీ అలరించి ఉన్నారు ఈ మొదటి రోజు కార్యక్రమానికి వదాన్యులు కళాభారతి అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు గారు 2.5 లక్షలు సాయం అందించారు. ఈ అవార్డు లో భాగంగా రమారమి మూడు లక్షల రూపాయలు విలువచేసే స్వర్ణకమలంని వైభవ్ జ్యువెలర్స్ గత 19 సంవత్సరాలుగా ఇస్తున్నారు .

రెండో రోజు కార్యక్రమంలో భాగంగా సంగీత కళానిధి” శ్రీ నైవేలీ సంతానగోపాలన్ , చెన్నై వాస్తవ్యులు అద్భుతమైన గాత్ర సంగీత కచేరి ని చేయనున్నారు.

మూడవ రోజు ఆగస్టు 15 నాడు “సంగీత కళా భారతి” డాక్టర్ పంతుల రమ గాత్ర సంగీత కచేరి ఉంటుంది.

నాలుగవ రోజు అంటే బుధవారం 16 వ తారీఖున ప్రముఖ గాత్ర సంగీత విద్వాంసులు చెన్నై వాస్తవ్యులు మధురై కృష్ణ టిఎన్ శేషన్ గోపాలన్ గాత్ర కచేరీ ఉంటుంది.

ఐదో రోజు 17. 8. 22 బుధవారం నాడు సితార్ హిందుస్తానీ- వయొలిన్ కర్ణాటక instrumental జుగల్బందీ ఉంటుంది .

ఆరవ రోజున అంటే 18 గురు వారం నాడు ప్రముఖ గాత్ర విద్వాంసురాలు బెంగళూరు వాస్తవ్యులు M.S.షీలా గాత్ర కచేరీ ఉంటుంది.

చివరి రోజు అంటే ఏడవ రోజు శుక్రవారం నాడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో తెలుగుని మరిచిపోయి పద్యాలను పూర్తిగా మర్చిపోయి కొనసాగుతున్న ఈ సమాజంలో తెలుగు పద్య నాటకం” అల్లసాని పెద్దన” కార్యక్రమం ఉంటుంది.

ఈ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించి విజయం చేకూరాలని సహకరించిన వారు ఎస్.ఆర్.కె Infra ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైభవ్ జ్యువెలర్స్ , సి ఎస్ న్ రాజు, డి.ఎస్.ఎన్ రాజు అండ్ లక్ష్మీకాంతం , ది కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్, kankatala silks, మహామారుతి లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ , సాముద్రిక సాఫ్ట్వేర్ , ఎం ఆర్ సి అధిపతి శ్రీ రాంబాబు వీరందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు

ముఖ్యంగా సంగీతం నాటకం సాహిత్యం ఇలాంటివన్నీ మరుగున పడి పోకుండా ప్రోత్సహించే సదుద్దేశంతో, గురువుల దగ్గర ముఖతః గానే కాకుండా చూసి కూడా చాలా నేర్చుకోవాల్సి ఉంటుందని ఈ జెనరేషన్ వాళ్ళు అందరికీ అవకాశం కల్పించాలని విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అన్ని కార్యక్రమాలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తూ అందరిని ఆహ్వానిస్తోంది.

గురువులు, శిష్యులు ప్రశిష్యులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో విచ్చేసి చూసి ఆనందించి విజయవంతం చేయాలని కోరుతున్నాం.

ముందుగా కార్యక్రమాల ఆహ్వాన పత్రికను అధ్యక్షులు M.S.N. రాజు, కార్యదర్శి గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణ ప్రసాద్, మల్లిక మనోజ్ గ్రంధి , నరసింగరావు, మోహన్ దాస్ విడుదల చేశారు.

You may also like