The tribals of Visakha Agency area have alleged that the YCP government is eradicating the tribal rights #vizagwebnews
వైసీపీ ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తుందని విశాఖ ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగం గిరిజనులకు అనేక హక్కులను కల్పించినా వాటిని అమలుచేయడం లో ఎపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గిరిజనులు మండిపడుతున్నారు. గిరిజనులకు కేటాయించిన నిందులను దారిమల్లిస్తున్నారని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ గిరిజన నాయకులు గిరిహక్కుల అమలులో ప్రభుత్వ అలసత్వాన్ని నిలదీశారు. విశాఖ లో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శివశంకర్.. గంగులయ్య..జనసైనికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజనుల కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు.. హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పేరుతో విశాఖ ఏజెన్సీలో అక్రమ మైనింగ్ కు అనుమతులు ఇస్తుందని జనసేన నాయకులు ఆరోపించారు. గిరిజనులను వివిధ తెగలుగా విభజించి వారి మధ్య విబేధాలు సృష్టించేందుకు కుట్రచేస్తుందని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటువంటి చర్యలు మానుకోలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెవుతామని వారు హెచ్చరించారు.