Sri P P A Seva Trust, from Dec 4th to10th of January, Nitya Annadana program for Ayyappa Swamu.

by prasad
15 views

Sri P P A Seva Trust, from Dec 4th to10th of January, Nitya Annadana program for Ayyappa Swamu.#vizagwebnews అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచార సభ
శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి జనవరి 10వ తేదీ వరకు డి.బి.కె రైల్వే క్వార్టర్స్, డి.ఆర్.ఎం. ఆఫీస్ వెనుక, దొండపర్తి, విశాఖపట్నంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆదిమోహన రెడ్డి గురుస్వామి తెలిపారు. దొండపర్తి ఎరుకుమాంబ గుడి ఎదురుగా గల పీఠం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7న సాయంత్రం డిఆర్ఎం కార్యాలయం వెనుక గల డి.బి.కె రైల్వే క్వర్టర్స్ వద్ద అంబలం పడిపూజ మహోత్సవం, భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేరళ వారిచే పంచ వాయిద్యాలు ఆభరణ, తిరువీధోత్సవం గొప్ప భజన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్ కే ఎం ఎల్ విద్యాసంస్థ సీఈవో నాగేశ్వరరావు, కృష్ణయ్య మాట్లాడుతూ ఈ పీఠాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, 36 ఏళ్ల నుంచి ఆదిమోహన్ రెడ్డి ఈ పీఠం ద్వారా సేవలందిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బెందాలం అనిల్ బాబు
చైర్మన్ శ్రీనివాసరావు,
అధ్యక్షులు నరహరి స్వామి, కార్యదర్శి నాగేశ్వరరావు, కోశాధికారి రవికుమార్,
హరి ప్రసాద్, జి బంగారు నాయుడు, పాపారావు, సుమన్ పీఠం స్వాములు పాల్గొన్నారు.

You may also like