Itlu Maredumilli Prajanikam film unit promotion buzz #vizagwebnews ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్ర యూనిట్ ప్రమోషన్ సందడి
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రం ద్వారా అడవుల్లో నివసించే గిరిజన ప్రజలు సరైన వస్తువు లేక పడుతున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపమని చిత్ర హీరో అల్లరి నరేష్ చెప్పారు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్ర యూనిట్ ప్రమోషన్ లో భాగంగా నగరంలో హోటల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది . ఈ సందర్భంగా చిత్ర హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ నాంది చిత్రం తర్వాత అంతటి గొప్ప క్యారెక్టర్ ఈ సినిమాలో చేసామన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా నగరాల్లో ఎన్నో వసతులు ఉన్నా , అడవుల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు సరైన వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. రహదారులు, సరైన తిండి, వైద్యం, విద్యా వంటి వసతులు లేక ఎండనక, వాననక కష్టపడుతూ ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నారు. ఈ చిత్రంలో తను టీచర్ క్యారెక్టర్ చేశానని వృత్తిరీత్యా ఒక అడవిలోకి వెళ్తే అక్కడ పడుతున్న వారి బాధలు చూసి దానిపై ఎటువంటి పోరాటం చేసామనేది, ఎటువంటి మార్పు తీసుకొచ్చాం అనేది ఈ చిత్రంలో చూపమన్నారు. 56 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని , ఈ చిత్రానికి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహించగా, రాజేంద్ర దొండ నిర్మాత గా వ్యవహరించారు అన్నారు. ఈ చిత్రం నవంబర్ 25న చిత్రం విడుదలవుతుందని, తప్పనిసరిగా విజయవంతం చేయాలని కోరారు. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ అత్యద్భుతమైన హాస్యభరితమైన చిత్రాలు తీశారని ఆ ఒక్కటే అడక్కు చిత్రం కొత్త కాన్సెప్ట్ తో భవిష్యత్తు లో తీయాలని ఆలోచన ఉంది అన్నారు.తదుపరి ఉగ్రం చిత్రం లో నటించనున్నట్లు చెప్పారు.
హాస్యనటుడు ప్రవీణ్ మాట్లాడుతూ ఈ చిత్రం సందేశాత్మకంగా, అందర్నీ ఆలోచింపచేసే విధంగా ఉంటుందన్నారు. మారేడుమిల్లి అడవుల్లో షూట్ చేశామని ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. నటుడు కుమ్నన్ (రమణ) మాట్లాడుతూ ఇందులో పెద్ద అనే క్యారెక్టర్ చేశామని సరిలేరు నీకెవ్వరు తర్వాత అంతటి గొప్ప క్యారెక్టర్ ఇందులో తనకు దక్కింది అన్నారు. ఈ సమావేశంలో నటుడు శ్రీతేజ్ పాల్గొని మాట్లాడారు.
Itlu Maredumilli Prajanikam film unit promotion buzz
Allari Naresh, the hero of the film, said that through the film Itlu Maredumilli Prajanikam, the problems faced by the tribal people living in the forests due to lack of proper materials should be shown. As part of the promotion of Itlu Maredumilli Prajanikam film unit, a press conference was arranged at a hotel in the city. On this occasion, the film’s hero Allari Naresh said that he has done the greatest character in this film after Nandi. Even though many years have passed since independence, there are many facilities in the cities, but the tribal people living in the forests are facing various conditions without proper facilities. They are living a very miserable life without any facilities like roads, proper food, medical and education. In this film, he said that he played the character of a teacher, and if he goes to a forest professionally, he will see the sufferings of the people there, and he will fight for it and bring about any change in this film. He said that the shooting was completed in 56 days. The film was directed by AR Mohan and produced by Rajendra Donda. The movie will be released on November 25th and it must be a success. He said that his father EVV Satyanarayana had made excellent comical films and that is the only Adakku film in the future with a new concept.
Comedian Praveen said that this film will be informative and thought provoking. He said that he shot in the forests of Maredumilli and we hope that everyone will get a good name. Actor Kumnan (Ramana) said that he played a character named Pedda in this film and said that he got the biggest character after Sarileru Neekevvaru. Actor Sritej participated and spoke in this meeting.