Collector Dr. A Mallikarjuna along with MLA T. N.R inaugurated the newly developed Govt S W C G H

by prasad
2 views

District Collector Dr. A Mallikarjuna along with MLA Tippala Nagireddy inaugurated the newly developed Government Social Welfare College Girls Hostels on Thursday morning.

నడుపూరు, దయాళ్ నగర్ లలో అభివృద్ధి చేసిన బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ప్రారంభం.

– పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున , ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి.

విశాఖపట్నం, ఏప్రిల్ 27 :- పెదగంట్యాడ మండలం నడుపూరు , దయాళ్ నగర్ లలో కోరమండల్ ఇంటర్నేషనల్ వారి సిఎస్ఆర్ నిధుల తో నూతనంగా అభివృద్ధి చేసిన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాలను గురువారం ఉదయం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నడుపూరు లో సుమారు 20 లక్షల అంచనా తో కోరమండల్ సంస్థ అభివృద్ధి పనులు చేపట్టగా, నేటికి 73 లక్షలు వరకు ఖర్చు చేసారని అన్నారు. ఎంతో అందంగా తీర్చిదిద్దారని తెలిపారు. తను కూడా చిన్నతనంలో హాస్టల్లో చదువుకున్నానని , ఆనాడు ఇటువంటి సదుపాయాలు లేవని అన్నారు . ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు చాల అదృష్టవంతులని , ఈ సదుపాయాలు వినియోగించుకొని చదువులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. బాలికల సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేసేందుకు సహకరించిన కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ వారిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం కూడా నాడు-నేడు పథకం ద్వారా రాష్ట్రంలో ఎన్నో పాఠశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాల అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇటువంటి సుమారు 10 వసతి గృహాలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో రెండు వసతి గృహాలు కోరమండల్ వారి సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని , అలాగే దివిస్ లాబరేటరీస్ వారి సహకారంతో మరొక రెండు హాస్టల్స్ మిగిలిన ఆరు హాస్టల్స్ అభివృద్ధికి వివిధ సంస్థలు, యాజమాన్యాలు ముందుకు రావాలని కోరారు. అనంతరం దయాల్ నగర్ లో 23 లక్షల తో అభివృద్ధి చేసిన బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారు.

గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ బాగా వెనకబడిన పెదగంట్యాడ గ్రామంలో సి ఎస్ ఆర్ నిధులతో ఇటువంటి కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ చేపట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు . కోరమండల్ యాజమాన్యం వారు ఈ వసతి గృహాలను చాలా అధునాతనంగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్పర్సన్ పల్లా
చినతల్లి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రమణమూర్తి , కోరమండల్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞాన సుందరం, కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి, విద్యార్థినులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.#vizagwebnews

You may also like