ఏజేన్సీ భూర్జలో వైకాపా విజయోత్సవ వేడుకలు

by admin
1 views

విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ వైసిపీ సర్పంచ్ గా ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా బూర్జ గ్రామములో దింసా నృత్యా లతో అ గ్రామం అంతా సందడి వాతావరణం నెలకొంది.
ఈ సందర్బంగా సర్పంచ్ పాంగి మొత్తి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీ తో నన్ను గెలిపించిన 14 గ్రామాల ప్రజలకు ధన్యవాదములనీ మీ అందరి సహకారం తో పంచాయతీ నీ ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఈ పంచాయతీ లో నెలకొన్న సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పోలవరపు అప్పారావు మాట్లాడుతూ హుకుంపేట మండలంలో 33 పంచాయితీలు ఉన్నాయి. ఆ 33 పంచాయతీలలో బాగా వెనుకబడిన పంచాయతీ ఈ బూర్జ పంచాయతీ మాత్రమేనని, ఈ బూర్జ పంచాయతీలో 14 గ్రామాలు ఉన్నాయని, కొండయ్య పాడు, అల్లంగూడ, సులుపా, ఎగ సల్దంగి, దిగువ సల్దంగి గ్రామాలు అసలు అభివృద్ధికె నోచుకోలేదనీ ఆ గ్రామాలన్నిటికి అభివృద్ధి చేయడానికి మా అరకు శాసనసభ్యులు శెట్టి పాల్గుణ గారి ద్వారా నిధులు తీసుకొని ఈ 14 గ్రామాలకు కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ 14 గ్రామాలకు రోడ్లు లేవు, మంచినీరు లేదు, డ్రైనేజీ లేవు, స్కూల్ బిల్డింగ్ లేదు, ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి కుంటుపడిందని ఆయన అన్నారు. మన జగనన్న ప్రభుత్వం లో మన శాసన సభ్యులు చెట్టి పాల్గుణ గారి నాయకత్వంలో మా పంచాయతీలో అన్ని కూడా సమాన అభివృద్ధి చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ సింబోయ్ లక్ష్మి, వార్డ్ మెంబెర్స్ నన్నివిజయ్, సాబోయ్ అప్పలమ్మ, మజ్జి పద్మిని, పరిశీల గురిబారి, సలిపి కామరాజు, బోండా పొట్టిబాబు, కిల్లో భాస్కర్రావు పాల్గొనిరి.

You may also like