నడింవీధి నల్ల రాయి క్వారీని తక్షణమే నిలిపివేయాలి-అమర్
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు(ఏ ఐ వై ఫ్)
పాడేరు మండలం లో చింతలవీధి నడింవీధి వద్ద నల్లరాయి క్వారీని నిలిపివేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమర్ డిమాండ్ చేశారు.నడింవీధి గ్రామంలో ప్రజలుతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవటం జరిగింది.తదనంతరం గ్రామప్రజాలతో నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ గోలి భాస్కర్ రావు బినామీ గా ఉన్నారని బండి వెంకటేశ్వర్లు అను వ్యక్తి ఈ క్వారీ తవ్వకాలు చేపడుతున్నారని అన్నారు. క్వారీ వద్దకు వెళ్లి చూడగా పెద్దఎత్తున అమ్మోనీయం నైట్రేట్,జిల్లేటిన్ స్టిక్స్,కేబుళ్లుతో 100 కి పైగా బాంబు లు పెట్టి ఒక్కసారిగా బ్లాస్ట్ లు చేస్తున్నారు. చాలా లోతు వరకు రాయి తవ్వకాలు చేసారని అన్నారు.ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల క్వారీకి అనుకోని ఉన్న నడింవీధి గ్రామంలో భూమి మొత్తం కంపించిపోవటం,ఇంటి పై రేకులు విరిగిపోతున్నాయని గోడలు బీటలేస్తున్నాయని గ్రామం లో చిన్నారి పిల్లలు,పెద్దలు భేదోళనకి గురవుతున్నారని,అలానే అత్యంత దారుణంగా అక్కడి గ్రౌండ్ లెవల్ వాటర్ మొత్తం ఇంకిపోవటం వలన మూడు రోజులకొకసారి కుళాయిలు వస్తున్నాయి.దీనిములన గ్రామంలో ప్రజలు గుక్కెడు నీళ్లు లేఖ దప్పిక తీర్చుకోలేని పరిస్థితులలో ఉన్నారని అన్నారు.ఆ వంద కుటుంబాలు వరుకు నివసముంటున్నాయని ఈ క్వారీ బ్లాస్ట్లు వలన రోజు రోజు దినదిన గండంగా అక్కడి ప్రజలు బతుకుతున్నారని అన్నారు.కనుక ఇక్కడ గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని ఈ క్వారీ తవ్వకాలు ఆపాలని అఖిల భారత యువజన సమాఖ్య గా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఇప్పటికైనా అధికారులు ఈ క్వారీ తవ్వకాలు నిలిపివేయాలని లేకుంటే క్వారీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలని ఐక్యం చేసి పెద్దఎత్తున ఈ మైనింగ్ తవ్వకాలు నిలిపివేసేంత వరుకు పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ సమస్యని రాష్ట్ర స్థాయి అధికారులు, రాష్ట్ర ప్రజా ప్రతినిధులు దృష్టికి తెరసుకెళ్తాని అన్నారు.ఈ గ్రామంలో ప్రజలకి రక్షణ కల్పించుటకై ఏ ఐ వై ఫ్ ఆధ్వర్యంలో ఎంతవరుకైనా ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉల్లి రామారావు మాజీ ఎంపిటిసి, కోండిబ లక్ష్మయ్య,కీల్లో శుక్రన్న, కీల్లో Vబొంజుబాబు, వంతల కంచి,కొర్ర రాణి, గోల్లోరి, సుబ్బలక్ష్మి, వంతల, మంగమ్మ, ఉల్లి నిలమ్మ, కొండమ్మ గోల్లోరి, రామారావు తదితరులు పాల్గొన్నారు.