అరుకులోయలో తెదేపా విజయోత్సవ వేడుకలు

by admin
2 views

అరకు లోయ మండలం పేదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టాలి దాసు ను మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి పెట్టెలి దాసుబాబు ను గెలిపించిన పంచాయతీ ప్రజలకు ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రావణ్ కుమార్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం కృతజ్ఞతలు తెలియజేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. అలాగే ప్రత్యేకంగా ఈ పంచాయతీని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దత్తత తీసుకొని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా పెదలబడు పంచాయతీ సర్పంచ్ గా గెలుపొందిన పెట్టెలి *దాసుబాబు మాట్లాడుతూ ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సహకారంతో పంచాయతీని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.

You may also like