అత్యంత వైభవంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరద పాయసం ఉత్సవము

by prasad
4 views

#vizagwebnews
అత్యంత వైభవంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరద పాయసం ఉత్సవము
వైభోగం వరద పాయసం ఉత్సవం

శాస్త్రోక్తంగా వైకుంఠవాసుడు కి పూజలు

వరుణుడు కరుణించాలని ఏటా నిర్వహణ

సింహాచలం..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం వరద పాయసం ఉత్సవము అత్యంత వైభవంగా నిర్వహించారు.. ప్రతి ఏటా సాంప్రదాయబద్దంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవోఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు.
ఉత్సవంలో భాగంగా తొలుత అప్పన్న ఆలయానికి ఉత్తరాన ఉన్న వైకుంఠవాసుడు మెట్ట పై శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
వైకుంఠ నారాయణుడు అమ్మవార్లను తొలుత అందంగా తీర్చిదిద్దారు. తదుపరి విశ్వక్సేన, పుణ్యహవచనం, ఆరాధన పంచామృతాభిషేకం,
కలశారాధనతో పాటు విశేష పూజలు జరిపించారు.. అనంతరం అక్కడే తయారు చేసిన పాయసం తీసుకువచ్చి స్వామి అమ్మవార్లకు నివేదించారు.. వేద పండితులు వేద మంత్రాలు వల్లిస్తుండగ, మృదు మధుర మంగళ వాయి ద్యాల నడుమ ఉత్తరం బాగాన ఉన్న కొండపై నుంచి పాయసం బండలమీద గా పారబోశారు.
వరద పాయసం ఉత్సవము నిర్వహిస్తే ఆ వరునుడు కరుణించి సమృద్దిగా వర్షాలు కురుస్తాయని భక్తకోటి ప్రగాఢ విశ్వాసం.. అందుకు తగ్గట్లుగానే ప్రతియేటా వరద పాయసం ఉత్సవము నిర్వహించడం తరువాత వర్షాలు కురవడం ఆనవాయితీగా వస్తోంది.. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరిపించారు.
స్థానాచార్యులు టి పి రాజగోపాల్, ఆలయ పురోహితులు, అలంకార్ కరి సీతారామాచార్యులు
ఇన్చార్జి ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు,
ప్రసాదాచార్యులు వేదపండితులు, అర్చక పరివారం పూజలు నిర్వహించారు.

You may also like