
సోనూసూద్.. తెలుగువారికి బాగా తెలిసిన బాలీవుడ్ నటుడు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టీస్టుగా కనిపించారు. ఇప్పుడు సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి కి విలన్ గా మారాడు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి రోజుకో ఆసక్తికర వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో సోనూసూద్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ నే తెలిపారు. ‘చిరంజీవి గారి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీ నాకు ఎంతో ప్రేమను ఇచ్చింది. ఈ చిత్రం ద్వారా వారికి మరోసారి నా ప్రేమను ఇస్తానని నమ్ముతున్నా’ అని అన్నారు.
ఇక ఓ కీలక పాత్రలో నటించేందుకు సూపర్‌స్టార్ మహేష్ బాబు ఓకే చెప్పారట. అంతేకాదు 30రోజుల క్యాల్షీట్లు కూడా ఇచ్చినట్లు సమాచారం.