సల్మాన్ ఖాన్ తో త్రివిక్రమ్ సినిమా ?

by admin
34 views

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని టాలీవుడ్ స్టార్ హీరోలు ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కూడా త్రివిక్రమ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు సమాచారమ్. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో త్రివిక్రమ్ సినిమా ఫిక్సయినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అల.. వైకుంఠపురంలో.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అల.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రూ. 200కోట్లపైగా వసూలు చేసింది. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులని బద్దలు కొట్టింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రిమేక్ చేయాలనే ప్లాన్ లో నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారు. ఈ రిమేక్ లో నటించేందుకు సల్మాన్ ఖాన్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలొచ్చాయ్. అల.. బాలీవుడ్ రిమేక్ కి త్రివిక్రమ్ నే దర్శకత్వం వహించే అవకాశాలున్నట్టు లెటెస్ట్ న్యూస్. మరీ..ఈ న్యూస్ కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందా ? లేక.. రియల్ అవుతుందా ?? అన్నది చూడాలి. 

You may also like