షారుక్ ఇక సినిమాలకి గుడ్ బై చెప్పాల్సిందే.. !

by admin
4 views

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇక సినిమాలకి గుడ్ బై చెప్పాల్సిందే అంటోంది ఆయన సతీమణి గౌరీ ఖాన్. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భం ఇచ్చిన ప్రసంగంతో షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (డీ డీ ఎల్‌ జే) సినిమాను ఇండియాస్‌ క్లాసిక్‌ సినిమా అంటూ కీర్తించిన సంగతి తెలిసిందే.

ఈ విషయంపై తాజాగా గౌరీ ఖాన్ స్పందించారు. 1995లో రిలీజ్‌ అయిన ‘డీడీఎల్ జే’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కిస్తే బాగుంటుంది. అంతేకాదు సీక్వెల్‌ లోనూ షారూఖ్‌ హీరోగా నటిస్తే ఇంకా బాగుంటుంది. అలా చేస్తారనే నేను భావిస్తున్నా. డీ డీ ఎల్ జే దర్శక నిర్మాత ఆదిత్య చోప్రాతో ఈ విషయం గురించి చర్చిస్తానని చెప్పింది. అంతేకాదు.. షారూఖ్‌లో కూడా ఓ మంచి డిజైనర్‌ ఉన్నాడు. ఇక ఆయన సినిమాలు మానేసి, డిజైనింగ్ మొదలు పెట్టాలని సరదా కామెంట్ చేసింది.

You may also like