పవర్‌స్టార్ ‘వకీల్ సాబ్’ ప్రమోషన్స్ స్టార్ట్స్

by admin
14 views

పింక్ రిమేక్ తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. మే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలని మార్చి నెలలో ప్రారంభించబోతున్నారు.

మార్చి 2న తెలుగు పింక్ ఫస్ట్ లుక్, మార్చి 8న తొలిపాటని రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రం కోసం వ‌కీల్ సాబ్ టైటిల్‌తో ప్ర‌చారంలో ఉంది. ఈ చిత్రంలో అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని కూడా వేగంగా జ‌రుపుకుంటుంది.

You may also like