చిరంజీవి ఇంటివద్ద టెన్షన్ వాతావరణం

by admin
8 views

ఏపీ రాజధాని అమరావతికి మద్దతుగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ 29న ఉదయం 11 గంటలకు ఆయన నివాసం ముట్టడించాలని నిర్ణయించినట్లు అమరావతి యువ జేఏసీ పేరుతో సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అప్రమత్తమయ్యారు. చిరంజీవి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. చిరంజీవి ఇంటికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు పెట్టి నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రణాళిక రూపొందించారు.

మరోవైపు, చిరంజీవి నివాసం ముట్టడికి తాము పిలుపు ఇవ్వలేదని, కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేశారు. ఈ ప్రచారానికి ఐకాసకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల పోలీసులకు ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే, చిరంజీవి ఇంటి పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

You may also like

Leave a Comment