కొత్త లుక్ లోకి బన్నీ

by admin
8 views

ఈ యేడాది అల.. వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా రూ. 200కోట్లకి పైగా వసూలు సాధించింది. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసింది. ఈ జోష్ లో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందులు రెడీ అయ్యారు బన్నీ. ఈ సినిమా కోసం బన్నీ కొత్త లుక్ లోకి మారిపోయాడు.

ఆ లుక్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చి మూడో వారం నుండి చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. 40 రోజుల పాటు కేర‌ళ అడ‌వుల్లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్న‌ట్టు స‌మాచారం. బన్నీ-సుక్కు కాంబోలో వచ్చినఆర్య‌, ఆర్య 2 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయ్. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

You may also like

Leave a Comment