మత్స్యావతారం లో శ్రీ జగనాధుని దివ్యదర్శనం

by vizagwebnews.com

మత్స్యావతారం లో శ్రీ జగనాధుని దివ్యదర్శనం #vizagwebnews హిందూమత పురాణాలలో శ్రీమహావిష్ణువు దశావతారాలలో మొద అవతారం మత్స్యావతారం. మత్స్యం అనగా చేప. ఈ అవతారంలో విష్ణువు రెండు పనులు చేసినట్లుగా పురాణ గాథ. ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. వేదాలను కాపాడడం.

ఆ రాక్షసుడిని సంహరించిన విధం పోతన భాగవతంలో ఇలా వర్ణించాడు (పోతన పద్యం)
ఉరకంభోనిధిలోని వేదముల కుయున్ దైత్యున్ జూచి వే
గరులాడించి ముఖంబు సాచి పలువీతన్ తోక సారించి మేన్
మెరయన్ దౌడలు గీరి మీసలడరన్ మీనాకృతిన్ విష్ణుడ
క్కరటిన్ దాకి వధించె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవున్

ఆ శ్రీమన్నారాయణుని సత్యవ్రతుడు ఇలా ప్రస్తుతించాడు (పోతన పద్యం)
చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై
వలనై కోర్కెల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటన్ బడి లోకమక్కటా వృధా బద్ధాశమై పోయెడున్
నిలువన్నేర్చునె హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభశ్శయ్యాపహా!

సత్య వ్రతుని కీర్తనలకు సంతోషించి శ్రీమత్స్యావతారమూర్తి అతనికి సాంఖ్యయోగ క్రియను, పురాణ సంహితను ఉపదేశించెను. అందరితోను, మూలబీజములతోను ఉన్న ఆ నావను ప్రళయాంభోనిధిని దాటించెను.

సత్యవ్రతుడు ప్రస్తుతం నడుస్తున్న “వైవస్వత మన్వంతరానికి” అధిపతి అయ్యాడు.#vizagwebnews
In Hindu mythology, Lord Vishnu is the first incarnation of Lord Vishnu. Matsya means fish. In this incarnation Vishnu is said to have performed two tasks. Crossing the reservoir in a boat with living creatures during the deluge. Preserving the Vedas.
Potana has described the manner of killing that demon in Bhagavata
Kuyun Daityun Juchi Ve of the Vedas in Urakambhonidhi
Garuladinchi mukhabu sachi paluveetan toka nti mane
Merayan Daudalu Giri Mesaladaran Meenakritin Vishnuda
Kkaratin Daki Vhidinche Mushti Dalit Gravun Hayagrivun
Chelivai Chugmavai Manasthiduvai Chinmurtivai Atmavai
All the crops and harvests are for you
A lot of schools have gone to waste all over the world
Niluvannerchune Hemarashi Ganiyun Nirbhagyudambhassayyapaha!
Being pleased with Satya Vrat’s chants, Shrimatsyavataramurthy taught him Sankhya Yoga Kriya and Purana Samhita. That ship with everyone and Mulabijam crossed Pralayambhonidhi.
Satyavrata became the head of the current “Vaivasvata Manvantara”.

Related Articles

Leave a Comment