#vizagwebnews అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్ స్టేషన్లో 41 నోటీస్ కు స్టేషన్ బెయిల్ తీసుకునేందుకు వచ్చిన అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ…..
కొన్ని రోజుల క్రితం చోడవరం లో వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ప్రోద్బలం తో బుచ్చిబాబు ట్రడర్స్ లో జిఎస్టీ అధికారులమంటూ వచ్చిన అధికారులను నిలదీసినందుకు తనపై తప్పుడు కేసు పెట్టారని ఇలాంటి రాజకీయ వేధింపుల కేసులతో తనను బయపెట్టలేరని,
ధర్మ శ్రీ లాంటి అవినీతి సామ్రాట్ లు కూడా తన గురించి నోటికి వచ్చినట్టు నిరాధార ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు…
ధర్మ శ్రీ లాగ నేను పంచాయితీ ప్లాన్ అప్రూవల్ కి కూడా డబ్బులు వసూలు చేసే వ్యక్తిని కాదని, నాపై ఆరోపణలు మాని చోడవరం లో ధర్మ శ్రీ గురించి ప్రజాలేమనుకుంటున్నారో చూసుకోవాలన్నారు…
సీఎం రమేష్ బ్యాంక్ లకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడని ధర్మ శ్రీ లాంటి అవినీతి సామ్రాట్ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు
తాను కానీ తన కుటుంబసభ్యులు కానీ బ్యాంక్ సొమ్ము ఎగ్గొట్టినట్టు నిరూపిస్తే ఏం చెప్పినా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు.
తన వ్యాపార సంస్థలకు బ్యాంక్ లు A+ రేటింగ్ ఇచ్చాయని…ఇంటర్నెట్ లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చని, నా పై గెలవలేక నిరాధార ఆరోపణలు, అబద్ధపు కేసులు పెట్టడం తప్ప వైసీపీ నాయకులు ఏమీ చేయలేరన్నారు..
నెల రోజుల్లో చోడవరం లో కేఎస్ ఎన్ రాజు ను భారీ స్థాయిలో గెలిపించి
ధర్మశ్రీ ని చిత్తుగా ఓడించి ఇంటికి పంపుతామని తెలిపారు..
అసలు జిఎస్టీ రాష్ట్ర పరిధిలోనిధికాదని, కానీ రెవెన్యూ ఇంటిలిజెన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వం ఒక కొత్త డిపార్ట్మెంట్ ను సృష్టించి ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష సభ్యులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగింస్తున్న వైసీపీ పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు