మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు*
కేంద్రాల్లో పరీక్షలు.. హాజరుకానున్న 12,051 మంది విద్యార్థులు
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
అల్లూరి జిల్లా పాడేరు, మార్చి 16 :
బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పరీక్షల షెడ్యూల్ ప్రకారం మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప్రతి రోజూ ఒక పేపర్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పేర్కొన్నారు.
కలెక్టరేట్ వీసీ హాలులో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయ్తుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్.ఎస్.సి. 2024 పరీక్షలకు జిల్లా నుంచి 12,051 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, వారిలో 28,367 మంది రెగ్యులర్ వారు కాగా, 3,012 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారని వివరించారు. రెగ్యులర్ విద్యార్థులు 10,986 మంది హాజరు అవుతున్నారని, అందులో 5,066 మంది బాలురు, 5,920 బాలికలు హాజరవుతున్నారని వివరించారు.
ఈ మేరకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.
పరీక్షల నిర్వహణ కోసం 65 పరీక్షా కేంద్రాలను గుర్తించామని వాటిలో 16 ‘ఎ’ కేటగిరీ కేంద్రాలు, 38 ‘బి’ కేటగిరీ కేంద్రాలు, 11 ‘సి’కేటగిరీ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
స్టోరేజీ కోసం 22 పోలీస్ స్టేషన్ పాయింట్లను గుర్తించామని చెప్పారు.
10 రూట్లు ఏర్పాటు చేశామని, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని వెల్లడించారు.
65 పరీక్షా కేంద్రాలకు 65 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 65 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లును నియమించామని వివరించారు.
ప్రతీ కేంద్రంలోనూ అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ – 2024 పరీక్షలు
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ, 2024 పరీక్ష షెడ్యూల్ ప్రకారం మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు ప్రతి రోజూ ఒక పేపర్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 03వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
జిల్లాలో ఓపెన్ స్కూల్స్ నుండి పదో తరగతి 1,792 మంది, ఇంటర్ 2,189 మంది కలిపి 3,981 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు.
చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించామని, ఇతర ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
పదవ తరగతికి పాడేరు డివిజన్ లో ఆరు, రంపచోడవరం డివిజన్ లో మూడు కేంద్రాలు, ఇంటర్మేడియట్ కు పాడేరు డివిజన్లో నాలుగు, రంపచోడవరం డివిజన్ లో ఐదు పెరీక్షా కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు..#vizagwebnews